34వ డివిజన్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ.
తిరుపతి, అక్టోబర్ 01:

నగరంలోని 34వ డివిజన్ భవాని నగర్, పరిసర ప్రాంతాలలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య, టిడిపి తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి మునిశేఖర్ రాయల్ లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకతీతంగా 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి రాష్ట ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి చిరస్థాయిగా నిలచిపోయారన్నారు. 34వ డివిజన్ లోని ఇంటింటికి వెళ్లి అర్హులైన వితంతువులు వృద్ధులు వికలాంగులకు పెన్షన్లను సింగంశెట్టి సుబ్బరామయ్య, మునిశేఖర్ రాయల్ లు అందజేశారు. ఈ పెన్షన్ల పంపిణీలో వార్డు యూనిట్ ఇంచార్జ్ సురేష్ కుమార్ అధ్యక్షులు భూపతి కార్యదర్శి ప్రకాష్, కొండమ్మ, బూత్ కన్వీనర్లు గణేష్, యుగంధర్, యశ్వంత్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
