వరదయ్యపాలెంలో పసికందును ఇసుకలో పూడ్చి వదిలిన ఘటన
వరదయ్యపాలెం, సెప్టెంబర్ 29:

వరదయ్యపాలెం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి, గుర్తు తెలియని యువతి తన పుట్టిన పురిటి పసికందును రోడ్డు పక్కన ఇసుకలో పూడ్చి వదిలిన సంఘటన సంచలనంగా నిలిచింది.పరిస్థితిని పారిశుధ్య కార్మికులు గుర్తించి, పోలీసులకి సమాచారం అందించారు. సోమవారం ఉదయం హమాలీలు ఆసుపత్రికి చేర్చిన పసికందు ప్రాణాలతో ఉంది, అయితే కుక్కలు దాడి చేయడంతో చేతికి గాయాలు అయ్యాయి.పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
పసికందును శ్రీకాళహస్తి ఆసుపత్రికి తరలింపు
వరదయ్యపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న పురిటిబిడ్డను మెరుగైన వైద్య సేవల కోసం సోమవారం 108 అంబులెన్స్ ద్వారా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు వైద్య సిబ్బంది తెలిపారు.
చిన్న పిల్లలు వైద్యలు కొరత సూళ్లూరుపేట ఆసుపత్రికి తరలింపు
శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యులు లేకపోవడంతో, వరదయ్యపాలెం నుంచి తరలించిన పురిటిబిడ్డను మంగళవారం 108 అంబులెన్స్ ద్వారా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్టు వైద్య సిబ్బంది తెలిపారు.
