Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గాన్ని చైతన్య పరుద్దాం – పోరాటాలకు సిద్ధం చేద్దాం- ఏఐటియుసి జిల్లా కౌన్సిల్ తీర్మానం

కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గాన్ని చైతన్య పరుద్దాం – పోరాటాలకు సిద్ధం చేద్దాం- ఏఐటియుసి జిల్లా కౌన్సిల్ తీర్మానం

లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి – ఆటో హమాలి హకర్స్ అసంఘటితరంగా కార్మిక సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలి -పి మురళి

 

విశాఖ ఉక్కును కాపాడుకుందాం విభజన హామీల అమలుకు పోరాటాలు చేద్దాం

 

13 గంటల పని వద్దు- 8 గంటల పనే మద్దు

 

 

 

ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం తిరుపతి బైరాగి పట్టెడ లో గల గంధమనేని శివయ్య భవన్లో జిల్లా అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు కార్మిక వర్గం జరుగుతున్న తీవ్ర నష్టం ఏఐటియుసి నిర్వహించాల్సిన పాత్రపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది

..

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి..ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి కే రాధాకృష్ణ లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి దూకుడు పెంచిందని లేబర్ కోడ్స్ అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం మోడీ మెప్పుకోసం శరవేగంగా అమలుపరిచేందుకు సిద్ధపడటం చాలా దుర్మార్గమని 139 సంవత్సరాల క్రితం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేయడం ఓవర్ టైం డ్యూటీ ల ను పెంచడం మహిళా కార్మికుల కు రాత్రి షిఫ్టులు కేటాయించటం పనిచేయించుకోవచ్చు అని అటు కూటమి క్యాబినెట్లోనూ రాష్ట్ర అసెంబ్లీలోనూ తీర్మానం చేయడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం పట్ల పేద ప్రజల పట్ల ప్రజానీకం పట్ల కూటమి నేతలకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని పెట్టుబడిదారులు కోరుతున్న కోర్కెల అమలుకు చంద్రబాబు చెప్పేది ఒకటి చేసేదొకటి ఇలా ఉందని ఎల్ అండ్ టి సుబ్రహ్మణ్యం గారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు బహిరంగంగానే వారానికి ఏడు రోజులు రోజుకు 10 గంటలు పైగా పనిచేయాలని ఆదివారం పూట పెళ్ళాలతో ముచ్చట్లాడాల ఎందుకు ఆదివారం సెలవులు అంటూ మాట్లాడటం చూస్తుంటే కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నాన్ని పెట్టుబడుతారు కోరుకుంటూఉంటే దానికి తానా తందానా అంటు తలలు ఊపుతున్నారని చట్టాలు చేస్తున్నారని అందుకే కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి పోరాటాలకు సిద్ధం చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది అని వారు అన్నారు

 

పని గంటలు పెంచిన ప్రభుత్వం జీతాలు పెంచుతూ ఎందుకు నిర్ణయం చేయలేదని పెరుగుతున్న దళకు అనుగుణంగా జీతాలు ఎందుకు పెంచలని గత 13 సంవత్సరాలకు పైగా కార్మికుల పడుతున్న కష్టాలు ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకో చట్టాలు చేయటం లేదని వారు గట్టిగా ప్రశ్నించారు అందుకే కానీ కార్మిక వర్గాన్ని కదిలించాలి పోరాటాలను తీవ్రతరం చేయాలి అందుకు ఏఐటీయూసీ కార్యకర్తలు కాదన్న రంగంలోకి దిగాలి అని సమావేశం తీర్మానించింది

 

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు దొంగ దారిన ప్రైవేటుపరం చేయటానికి ప్రభుత్వాలు కుతంత్రాలు పన్ను తున్నాయని దొడ్డి దారిన ప్రయత్నాలు సాగిస్తున్నాయని దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక టీటీడీ లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని స్థానికులకు 70 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కనీస వేతనాలు అమలు చేయాలని ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యంతో కూడిన సదుపాయాలను కల్పించాలని అందుకు పోరాటాలకు సిద్ధం కావాలని సమావేశం తీర్మానించింది

 

అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాదిమంది కార్మికులకు సంక్షేమ చట్టాన్ని భవన నిర్మాణ కార్మికుల సలహాలు అమలు పరచాలని హమాలీ కార్మికులు వీధి వర్తక వ్యాపారస్తులు ఆటో ట్యాక్సీ డ్రైవర్లు ఎంతోమంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారని వారికి ప్రభుత్వాలు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదని అందుకు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం సలహాలు రాష్ట్రంలో అసంఘటితరంగా కార్మికులకు సంక్షేమ చట్టం తేవాలని 50 సంవత్సరములు వయస్సు వచ్చిన వారికి పదివేల రూపాయల పెన్షన్ సౌకర్యం ఉచిత వైద్య ఇన్సూరెన్స్ సౌకర్యం పిల్లల చదువులకు పెళ్లిళ్లకు ప్రసవాలకు అండగా ఉండే సదుపాయాలుతో సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని లేని పక్షంలో కార్మిక వర్గాన్ని కదిలించి పోరాటాలకు సిద్ధపడాలని సమావేశం తీర్మానించింది

 

ఈ సమావేశంలో శ్రీరాములు. ఎన్ డి రవి. శివ ky రాజా ys మణి. గోవిందస్వామి చముండే శ్వరి ఉదయ్ కుమార్. నారాయణ. కత్తి రవి. నాగేంద్ర. మల్లికార్జున. నాగరాజమ్మ. జాన్. మహేంద్ర. పురుషోత్తం రెడ్డి. బుజ్జి లాజారస్. కార్తీక్ భాష సుజాత ప్రకాష్ రమణయ్య సుశీల రైల్వే బాల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

 

నమస్కారములతో

 

కె రాధాకృష్ణ

 

జిల్లా ప్రధాన కార్యదర్శి

ఏఐటీయూసీ తిరుపతి

Related posts

ఘనంగా టిడిపి యువనేత మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు

Garuda Telugu News

*అ* క్షరాలు నేర్పిన గురువు… *ఆ* కలి తీర్చారు..

Garuda Telugu News

మహానగరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ కూ సైబర్ నేరగాళ్ల బెడద తప్పడం లేదు

Garuda Telugu News

Leave a Comment