తిరుమల శ్రీవారికి గొడుగులు

చెన్నై హిందూ మహాసభ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారికి సమర్పించే వాహనసేవ గొడుగులు, పాదుకలకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం హిందూ మహాసభ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొడుగులు, పాదుకలు శ్రీపురం శ్రీ నారాయణీ అమ్మవారి టెంపుల్ లో పూజలు నిర్వహించిన అనంతరం.. తమిళనాడులోని పలు గ్రామాల మీదుగా పూజలు అందుకుంటూ తిరుమల చేరుకుంటాయి. యాత్రలో భాగంగా ఆదివారం గొడుగులు, శ్రీవారి పాదుకలు ఆదివారం బీవీ రెడ్డి కాలనీలోని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారి గృహానికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పాదుకలను తలపై తీసుకెళ్లారు. గృహంలో తండ్రి గురజాల చెన్నకేశవుల నాయుడు తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పాల్గొన్నారు.
