*జీఎస్టీ ఫలాలు ప్రజలకు అందాల్సిందే*
*అక్టోబర్ 16 లోపు ఆక్వా సాగుకు రైతులు లైసెన్సులు పొందాలి*
*సంక్షేమ పథకాలు అమలుతో పాటు పరిశ్రమలు, పెట్టుబడుల సాధనలో దేశంలోనే అగ్రగామిగా ఏపీ*
*వైసీపీ నేతల కలలు, ఊహలు ఫలించే ప్రసక్తే లేదు*
*పొదలకూరులో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
జీఎస్టీ తగ్గింపుతో వచ్చే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూటమి నాయకులపై ఉంది
ప్రస్తుతం కొన్ని వస్తువులపై అసలు జీఎస్టీ లేకపోగా, కొన్నింటి 5, 18 శాతం శ్లాబులకు పరిమితం చేశారు
ఫలితంగా అనేక రకాల వస్తువుల ధరలు తగ్గిపోతున్నాయి
18 శాతం పన్ను కూడా ఏసీలు, టీవీలు, ఖరీదైన వాహనాలపైనే ఉంది
పొగాకు, పాన్ మసాలా, లగ్జరీ కార్లపైన మాత్రమే 40 శాతం పన్ను విధించారు
పాలు, గుడ్లు తదితర ఆహార పదార్థాలపై జీఎస్టీని తొలగించారు
జీఎస్టీ మార్పులు ప్రజలకు అనేక ప్రయోజనాలు కలిగించబోతున్నాయి
జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు అందేలా వ్యాపారులు సహకరించాలి..అమలుతీరును పర్యవేక్షించే బాధ్యత కూటమి నాయకులు, సామాన్య ప్రజలపైనా ఉంది
ఎక్కడైనా వ్యాపారులు సహకరించకపోతే అధికారులతో పాటు మా దృష్టికి తీసుకురండి
రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం ప్రజలకు అనేక ప్రయోజనాలు కలిగిస్తోంది
అక్టోబర్ 4న ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు చొప్పున అందించబోతున్నాం
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఈ ప్రయోజనాలు అందిస్తాం
చేపలు, రొయ్యలు రైతులు కచ్చితంగా ఆక్వా అథారిటీ వద్ద లైసెన్సులు పొందాలి. ఆ లైసెన్సు ఉంటేనే ప్రభుత్వ ప్రయోజనాలు, విద్యుత్ చార్జీల సబ్సిడీలు అందుతాయని గుర్తుంచుకోవాలి
అక్టోబర్ 16వ తేదీ లోపు ఆక్వా సాగు చేస్తున్న రైతులందరూ లైసెన్సులు పొందాలని కోరుతున్నాం
సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సంబంధిత మంత్రులకు అర్జీలు సమర్పించాం
ప్రజల సమస్యలను తెలుసుకోవడంలో రాష్ట్రంలోనే సర్వేపల్లి నియోజకవర్గం ముందుంది. త్వరలోనే టీపీ గూడూరు మండలంలోనూ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తాం
ఇప్పటి వరకు 2600 గిరిజన కుటుంబాలకు ఆధార్ కార్డులు ఇప్పించాం…వారికి రేషన్ కార్డులతో పాటు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు పొందేలా కషి చేస్తున్నాం
ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడంలోనూ, పరిశ్రమలు, పెట్టుబడులు సాధించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది
ఇవన్నీ ఓర్చుకోలేక వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వారి ఆశలు, ఊహలు నెరవేరే పరిస్థితి లేదు

డీఎస్సీ ఉద్యోగాల నియామక పత్రాలు అందించే ప్రక్రియ పండగ వాతావరణంలో కొనసాగింది.
సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన 43 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు…వారికి నా అభినందనలు
