అల్తూరుపాడు రిజర్వాయర్ పనులపై సీఎం గారి దృష్టికి ఎమ్మెల్సీ వినతి…

*🟡తిరుపతి జిల్లా,వెంకటగిరి నియోజవర్గం,డక్కిలి మండలంలోని అల్తూరుపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని, అవసరమైన పరిపాలనా అనుమతులను మంజూరు చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి విజ్ఞప్తి చేశారు…*
*🟡అసెంబ్లీ ఆవరణలో సీఎం ప్రత్యేక ఛాంబర్లో శనివారం ఎమ్మెల్సీ వినతిపత్రం అందజేశారు…*
*🟡2018లో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ₹310.39 కోట్ల పరిపాలనా అనుమతి ఇచ్చి పనులు ప్రారంభించినా, భూసేకరణ, అటవీ అనుమతులు, మట్టి కొరతల కారణంగా పురోగతి లేకపోయిందని తెలిపారు…*
*🟡ప్రస్తుతం సమస్యలు పరిష్కార దశలో ఉన్నాయని, తాజా అంచనాల ప్రకారం శేష పనుల వ్యయం ₹733.77 కోట్లు కాగా, ఇప్పటికే మంజూరైన నిధులు మినహాయిస్తే ₹423.38 కోట్లకు కొత్త పరిపాలనా అనుమతి అవసరమని ఎమ్మెల్సీ వివరించారు…*
*🟡ప్రాజెక్టు పూర్తి అయితే 90,464 ఎకరాలకు సాగునీరు, 223 గ్రామాలకు త్రాగునీటి సదుపాయం లభిస్తుందని, తిరుపతి జిల్లా రైతులకు ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని, అవసరమైన పరిపాలనా అనుమతులను మంజూరు చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి విజ్ఞప్తి చేశారు…*
