ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ను సద్వినియోగం చేసుకోండి

*ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సెప్టెంబర్ 29 వ తేది సోమవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం, 10.30 నుండి 11.30 గంటల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. పోన్ ద్వారా పిర్యాదులు చేసేవారు 0877-2227208 కి కాల్ చేసి మాట్లాడవచ్చని, ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తిరుపతి ప్రజలకు కమిషనర్ శ్రీమతి ఎన్.మౌర్య ఐఏఎస్ గారు తెలియజేశారు.*
*గమనిక: అర్జీదారులు వినతిపత్రంతో పాటు ఆధార్ కార్డు జతపరిచి, పనిచేయు ఫోన్ నంబర్లను పొందుపరచాలని కమిషనర్ తెలిపారు.*
