శ్రీసిటీ మ్యాంగో రిసార్ట్ కు ‘ఉత్తమ థీమ్-బేస్డ్ రిసార్ట్’ అవార్డు
శ్రీసిటీ, సెప్టెంబర్ 28, 2025 –

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక రంగం ఎంపిక చేసిన 2024-25 పర్యాటక ఎక్సలెన్సీ అవార్డులలో “ఉత్తమ థీమ్-బేస్డ్ రిసార్ట్” అవార్డును శ్రీసిటీ మ్యాంగో రిసార్ట్ అందుకుంది. ఇక్కడ అమలుచేస్తున్న స్థిరమైన, ఆకర్షణీయమైన ఆతిధ్య సేవలకు గాను ఈ గుర్తింపు దక్కింది.
శుక్రవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం-2025 వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు, పర్యాటక శాఖ మంత్రి కె.దుర్గేష్, సీనియర్ ప్రభుత్వ అధికారులు హాజరైన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. మాంగో రిసార్ట్ తరుపున రిసార్ట్ జనరల్ మేనేజర్ వై.శ్రీనివాసరావు ఈ గౌరవాన్ని స్వీకరించారు.
శ్రీసిటీలోని సుందర సువిశాల ప్రాంతంలో ఉన్న మ్యాంగో రిసార్ట్ 20 లగ్జరీ కాటేజీలు, 10 సాధారణ గదులను కలిగివుంది. ఇక్కడ బస చేసే అతిథులు మంచి ప్రకృతిని వీక్షించడంతో పాటు కయాకింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్, పక్షులను వీక్షించడం వంటి వివిధ రకాల కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ గ్లోబల్ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా రూపొందించబడిన పలు రకాల అంతర్జాతీయ వంటకాలు అందుబాటులో ఉంటాయి.
కాగా, వరుసగా రెండవ ఏడాది శ్రీసిటీ మ్యాంగో రిసార్ట్ కు రాష్ట్ర ప్రభుత్వ పర్యాటకరంగ ఉత్తమ అవార్డులు దక్కడం, ఆతిధ్య సేవల రంగంలో దీని నిబద్ధతను చాటుతుంది.
