Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది

తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇటీవలి కాలంలో రాజకీయ సభలలో ఎన్నడూ జరగనంత ప్రాణ నష్టం జరిగింది. హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్ లో ఏర్పాటు చేసిన రోడ్ షోలో దాదాపు 30 మందికి పైగా చనిపోవడం సంచలనంగా మారింది. ఇందులో చిన్నారులు, వృద్ధులు కూడా ఉన్నారు. ఆస్పత్రుల్లో ఇంకా 50 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఇందులో మరో పది పదిహేను మంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది.

 

విజయ్ పార్టీ ఏర్పాటు చేసిన సభలో ఇంత పెద్ద ప్రమాదం జరగటానికి కారణం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే సభకు 10 వేల మందికి మాత్రమే అనుమతి ఉండగా.. 50 వేల మంది వరకు వచ్చినట్లు అంచనా. హీరో విజయ్ ను చూసేందుకు భారీగా జనాలు తరలి వచ్చారు.

 

అయితే విజయ్ రావాల్సిన సమయానికంటే ఆరు గంటలు లేటుగా రావడంతో అభిమానులు పడిగాపులు కాశారు. ఆకలి దప్పికల నడుమ అప్పటికే అలసటతో ఉన్న జనం.. నీళ్ల బాటిళ్ల కోసం తోసు కోవడంతో గందరగోళం చెలరేగిందని తమిళమీడియా కథనాలు వెలువుడుతున్నాయి. దప్పికతో జనాలు స్పృహతప్పి పడిపోయే పరిస్థితులు ఉన్నట్లుగా భావించి.. జనంలోపలికి విజయ్ వాటర్ బాటిల్స్ విసరడంతో.. అప్పటికే టైట్ గా ఉన్న పరిస్థితుల్లో.. అభిమానులు బాటిల్స్ కోసం ఎగబడ్డారు. దీంతో తోపులాట స్టార్టయినట్లు సమాచారం.

 

మరోవైపు.. సభలో 9 ఏళ్ల పాప మిస్సైనట్లు సమాచారం రావడంతో.. అమ్మాయిని వెతికి పెట్టాలని విజయ్ స్పీచ్ మధ్యలో పోలీసులకు సూచించారు. కార్యకర్తలు కూడా సహాయం చేస్తారని విజయ్ చెప్పారు. దీంతో పాప స్పృహ తప్పిపడిపోయిందనే మాటలతో పాపను వెతికే క్రమంలో ఆందోళన చెందటంతోనే.. తోపులాట జరిగిందని మరో వర్షన్ ప్రకారం తెలుస్తోంది.

 

ఏదైతేనేం.. శనివారం (సెప్టెంబర్ 27) జరగకూడని నష్టం జరిగింది. విజయ్ రాజకీయ సభలో 30 మందికి పైగా చనిపోయారు. తొక్కిసలాటలో గాయపడిన వారి హాహాకారాల మధ్య ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి.

 

ఒకవైపు 10 వేల మందికి అనుమతి తీసుకుని 50 వేల మందితో సభ నిర్వహించటం నిర్వాహకుల తప్పయితే.. మరోవైపు.. హీరో అంటే వేలం వెర్రితో.. ముందూ వెనుక ఆలోచించకుండా.. వెర్రి తలలెత్తిన ఫ్యానిజంతో అభిమానులు ఎగబడటం మరో పొరపాటు. కారణం ఏదైనా అమాయకుల ప్రాణాలు పోవడంతో దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది.

 

ఈ ఘోర విషాదంపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. సభలో ఇంతమంది చనిపోవడం కలచివేస్తోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తొక్కిసలాటపై స్పందించారు. ఇదొక దురదృష్ట ఘటనగా ఆయన పేర్కొన్నారు. *అంతవరకు ఓకే కానీ చనిపోయిన 38 కుటుంబాలను దత్తత తీసుకుంటారా… ఆ కుటుంబాల ఆలనా పాలన ఆ పార్టీలు బాధ్యత తీసుకుంటాయా.. చనిపోయిన వారందరికీ ప్రభుత్వం రెండు లక్షలు.. మూడు లక్షలు.. ప్రకటిస్తాయి. ఏ పార్టీ మీటింగ్ లో చనిపోయారో ఆ పార్టీ వాళ్లు ఓ లక్ష రెండు లక్ష లో వాళ్లు ప్రకటిస్తారు… ఆ కుటుంబానికి ఇది సరిపోతుందా …వారు చనిపోవడం ముమ్మాటికి ఆ కుటుంబా లకు తీరని నష్టం. అసలు ఎందుకు పార్టీ బహిరంగ సభలకు తొక్కించుకొని మరి వెళ్ళాలా… వెళ్లి ప్రాణం మీదకు తెచ్చుకోవాలా… టీవీలో చూస్తే వద్దనిందా? చేతిలో ఎట్లా మొబైల్ ఉంది కదా దాంట్లో చూస్తే సరిపోదా …అంతగా లేకపోతే తర్వాత రోజు ఉదయం పేపర్ లో చూస్తే పోలా ..ఏదన్నా తొక్కి స్లాట్ లో జరగరానిది జరిగితే ప్రగాఢ సానుభూతి ఒక్క డైలాగు వేసి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు… రాజకీయ పార్టీలు ఏదైనా సరే మీటింగ్లలో జనాలను చూపించాలా.. అదే మా పార్టీకి బలం అని ప్రకటించుకోవాలా.. ఇది వారి సిద్ధాంతం? ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో చిరంజీవి పార్టీ పెట్టేటప్పుడు తిరుపతిలో జరిగిన బహిరంగ సభకు సుమారు 7 లక్షల మంది హాజరయ్యారు వారంతా ఓటేశారా? 2019 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జనాలు విపరీతంగా వచ్చారు.. తీర్పు ఇంకో మాదిరి ఇచ్చారు.. కరెక్ట్ గా ఒకటిన్నర సంవత్సరం ముందు జరిగిన ఎన్నికల్లో అదే మాజీ ముఖ్యమంత్రి జగన్ కు సముద్రం మాదిరి జనాలు వచ్చారు.. ప్రజల తీర్పు వేరే విధంగా ఇచ్చారు. దీన్నిబట్టి జనం ఎంత వచ్చినా ఒరిగేది ఏమీ లేదు. చూపించుకోవడానికి తప్ప …ఇంత చైతన్యం ఉన్న ప్రజలు ఎందుకు ఈ విధంగా మీటింగ్లకు వెళ్లి బలి అవుతున్నారో ..పాపం.. ఇకనైనా మేలుకోవాలి. ముందు మిమ్మల్ని కాపాడుకోవాలా ..తరువాత మీ కుటుంబాలకు మీరు రక్షణగా ఉండాలి …తర్వాతే రాజకీయాలైనా అదైనా.. ఈదైనా… ఏదైనా*..!!

Related posts

డెక్కన్ చాయ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

Garuda Telugu News

మంత్రి సత్య ప్రసాద్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే హేమలత

Garuda Telugu News

ప్రధాని మోదీ హత్యకు సీఐఏ కుట్ర..?

Garuda Telugu News

Leave a Comment