తిరుమల, 2025 సెప్టెంబర్ 27
శ్రీవారి ఆలయ సిబ్బందికి వస్త్ర బహుమానం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సేవలందిస్తున్న శ్రీవారి ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు, ఇతర సిబ్బంది, పోటు సిబ్బంది, వాహనం బేరర్లు, మేళం సిబ్బంది, కల్యాణకట్ట క్షురకులకు శనివారం ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు వస్త్ర బహుమానం అందజేశారు.
తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు చేతులమీదుగా వస్త్రాలను అందించారు.
ఈ సందర్భంగా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాల సిబ్బందికి వస్త్ర బహుమానం అందిస్తున్నట్టు చెప్పారు. స్వామివారి కృపతో సిబ్బందికి వస్త్ర బహుమానం అందించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీ రామకృష్ణ, పోటు పేష్కార్ శ్రీ మునిరత్నం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
——————
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
