వేడుకగా చెంచమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు

నారాయణవనం సెప్టెంబర్ 26 (గరుడధాత్రి న్యూస్) తిరుపతి జిల్లా, నారాయణవనం మండలంలోని వేత్తల తడుకు పంచాయతీ చిరంజీవి ఎస్టి కాలనీలో వెలసిన యానాదివాసుల కుల దైవమైన చెంచమ్మ అమ్మవారి ఆలయంలోశ్రీ చెంచమ్మ అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవముగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం నిత్య పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారికి పాలు, పెరుగు, నెయ్యి, కొబ్బరి నీళ్లు, సుగంధ ద్రవ్యాలతో, అభిషేకం చేసిన తర్వాత భక్తులకు అమ్మవారు దర్శనం కల్పించారు. సాయంత్రం 7 గంటలకు మేళ తాళాలు మంగళ వాయిద్యాలు నడుమ శ్రీ చెంచమ్మ అమ్మవారికి విశేష పూజలు, నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చిరంజీవి ఎస్టి కాలనీవాసులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
