దానిమ్మ గింజల అలంకారంతో అలరించిన అమ్మవారు.
కుప్పం,సెప్టెంబర్ 26 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం కొత్తపేటలో వెలసిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దసరా పూజలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దానిమ్మ గింజలు మరియు డ్రై ఫ్రూట్స్ తో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం, సాయంత్రం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు, కుసుమపుత్రి మహిళా మండలి సభ్యులు, వాసవి యువజన సంఘం సభ్యులు, ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులందరికీ ప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ అర్చకులు ఈశ్వరం సోమశేఖర శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి.

