*శేష వాహనం పై విహరించిన శ్రీరామచంద్రమూర్తి.*
బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్25

బైరెడ్డిపల్లి మండలం లోని తీర్థం గ్రామం లో కల శ్రీ రామచంద్రమూర్తి స్వామి ఆలయం దసరా బ్రహ్మోత్సవాలు సందర్భంగా శుక్రవారం స్వామి శేష వాహనము పై విహరించారు.ఈ సందర్భంగా ఉదయం స్వామికి మంతపోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు రంగయ్య శెట్టి కుటింభికులు ఉభయదార్లు గా వ్యవహరించారు.రాత్రిసీతా,లక్ష్మణ,హనుమంత సమేత శ్రీ రామచంద్రమూర్తి ఉత్సవ విగ్రహాలను వివిధ ఆభరణాలు,వివిధ పుష్పాలు తో అలంకరించి శెషవాహనం పై ఆశీనులు చేసి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు.ఈ కార్యక్రమంలో ఉభయదార్లు నారాయణ శెట్టి కుటింభికులు, భక్తులు పాల్గొన్నారు
