కాణిపాకంలో లలిత త్రిపుర సుందరి అలంకరణతో దర్శనమిచ్చిన అమ్మవారు

కాణిపాకం సెప్టెంబర్ 26( గరుడ ధాత్రి న్యూస్ )
కాణిపాకం దేవస్థానం అనుబంధం దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయం నందు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఐదవ రోజు శుక్రవారం *లలిత త్రిపుర సుందరి దేవి* అలంకారంలో దర్శనం ఇచ్చినమరగదాంభికా అమ్మవారు,రాత్రి వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.
