రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని వ్యక్తి మృతి

పాకాల రైల్వే ఎస్.ఐ జి.రత్నమాల
తిరుపతి జిల్లా, పాకాల
పాకాల మండలం ఉప్పరపల్లి సమీపాన ఉన్న రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 25 నుండి 35 సంవత్సరాల లోపు ఉండవచ్చని అన్నారు.అతను తెల్లని షర్టు మీద నల్లని గీతాలు కలిగి షర్ట్ వేసుకొని ఉన్నాడు.మృతి చెందిన వ్యక్తి ముస్లిం మతానికి చెంది ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాకాల రైల్వే ఎస్.ఐ జి.రత్నమాల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
