*స్టేషన్ బెయిల్ కోసం 40 వేలు అడిగిన ఎస్ఐ పై ఏసీబీ కేసు*

మణుగూరులో స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని బాధితుడిని 40 వేల రూపాయలు డిమాండ్ చేసిన ఎస్ఐ రంజిత్ పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కేసు నమోదు చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ఎస్ఐ రంజిత్ సుమారు 40 వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో, అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ విషయంపై ఏసీబీ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.
