*పిచ్చాటూరు లో భక్తి ప్రపత్తులతో శ్రీవారి గొడుగులు ఊరేగింపు*

✍️ *శ్రీ మలయ పెరుమాళ్ ఆలయానికి గొడుగులు సమర్పణ*
మండల కేంద్రమైన పిచ్చాటూరు లో శుక్రవారం సాయంత్రం శ్రీవారి గొడుగులు ఊరేగింపు భక్తి ప్రపత్తులతో సాగింది.
చెన్నై లోని తిరునిండ్రయూర్ కు చెందిన శ్రీమద్ రామానుజ ఆచార్య నిత్య కైంకర్యం ట్రస్టు వారు ప్రతియేటా చెన్నై నుండి పాదయాత్రగా గొడుగులు ఊరేగింపు గా తీసుకెళ్ళి గరుడ సేవ రోజున తిరుమల శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీ.
ఇందులో భాగంగా శ్రీవారి గొడుగులు యాత్ర శుక్రవారం పిచ్చాటూరు లోని శ్రీ మలయ పెరుమాళ్ ఆలయానికి చేరుకుంది.
సర్పంచ్ కేజీ రోస్ రెడ్డి, గ్రామ పెద్దలు శ్రీవారి గొడుగులు కు సాదర స్వాగతం పలికారు.
సాయంత్రం ట్రస్టు నిర్వాహకులు మలయ పెరుమాళ్ ఆలయానికి రెండు గొడుగులు సమర్పించగా సర్పంచ్, గ్రామ పెద్దలు స్వీకరించారు.
అనంతరం ఆలయం నుండి మంగళ వాయిద్యాలు నడుమ ఊరేగింపు బయలుదేరి బజారు వీధి, టూటౌన్ మీదుగా శ్రీవారి గొడుగులు ఊరేగింపు సాగింది.
గొడుగులతో పాటు శ్రీ గోవిందరాజు స్వామి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు భక్తులు కొబ్బరి కాయలు కొట్టి, కర్పూర నీరాజనాలు పలికారు.
ఈ ఊరేగింపులో శ్రీ ద్రౌపతమ్మ పండరి భజన బృందంలోని చిన్నారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకుంది.
ఈ ఊరేగింపులో గ్రామ సర్పంచ్ కేజీ రోస్ రెడ్డి, పెద్దలు తిరుమల రెడ్డి, పెరుమాళ్, రవి రెడ్డి, బాల శెట్టి, శంకర్ రాజు, శరవణ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
