కుప్పం రూరల్ టిడిపి అధ్యక్షులకు ఘన సన్మానం.

కుప్పం,సెప్టెంబర్ 25 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం రూరల్ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులు రాజగోపాల్ కు ఘన సన్మానం నిర్వహించారు. కుప్పం టిడిపి రూరల్ అధ్యక్షులుగా రాజగోపాల్ ను అధిష్టాన వర్గం నియమించిన విషయం విధితమే. దీంట్లో కుప్పం రూరల్ మండలం చెక్కున తం పంచాయతీలో గురువారం భారీ ఎత్తున సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు సంయుక్తంగా ఈ ఘన సన్మానాన్ని నిర్వహించారు. కుప్పం తెలుగుదేశం పార్టీ రూరల్ అధ్యక్షులు రాజగోపాల్, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ సలహా మండలి సభ్యులు రామచంద్ర లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
