*ఉపరాష్ట్రపతి, సీఎంతో కలిసి తిరుమలలో వేంకటాద్రి నిలయం వసతి సముదాయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్*

*తిరుమల:*
తిరుమలలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి వేంకటాద్రి నిలయం వసతి సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తుల కోసం నూతనంగా నిర్మించిన వేంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయం(పీఏసీ-5)తో పాటు శ్రీవారి ప్రసాదమ్స్ ఇన్ గ్రెడియంట్స్- విజన్ బేస్డ్ స్టోరింగ్ మెషిన్(లడ్డూ నాణ్యత యంత్రం) ను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా భవనం ప్రాంగణానికి చేరుకున్న రాధాకృష్ణన్, చంద్రబాబునాయుడుకు మంగళవాయిద్యాలతో అధికారులు ఘనస్వాగతం పలికారు. శ్రీ వేంకటేశ్వరస్వామికి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి వేంకటాద్రి నిలయం(పీఏసీ-5) ను లాంఛనంగా ప్రారంభించారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవనం మొత్తం కలియతిరిగి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. వసతి గృహం బుకింగ్ కౌంటర్ ను ఉపరాష్ట్రపతితో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు.
*సీఎం చంద్రబాబుతో కలిసి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్*
అనంతరం సీఎం చంద్రబాబుతో కలిసి తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్-1 లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ICCC) ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు బుధవారం రాత్రి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పద్మావతి అతిథి గృహంలో సీఎం చంద్రబాబుతో కలిసి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తో మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
*****
