
ఉపాధి హామీ గుంటలో ప్రమాద వశాత్తు పడి ఇంటర్ విద్యార్థిని మృతి.
వరదయ్య పాలెం మండలం కువ్వాకుల్లి పంచాయతీ లక్ష్మిపురం (k) గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం,కామేశ్వరి కూతురు శ్రీవల్లి (16) గూడూరు పట్టణం దొడ్ల రమాదేవి మహిళా కళాశాల లో ఇంటర్ మొదటి సంవత్సరం ఒకేషనల్ కోర్సులో (343)మార్కులు సాధించి
సెలవులు కావడంతో బర్రెలను కయ్యల్లో తొలడానికి వెళ్లిన శ్రీవల్లి ప్రమాద వాశాత్తు ఉపాధి హామీ గుంటలో బర్రెను తొలబోయి పడిపోవడంతో ఈత రాకపోవడం చుట్టుపక్కల ఎవరు లేక పోవడంతో నీటిలో మునిగి చనిపోయింది..
కూలి పనులకు వెళ్లిన తల్లి దండ్రులు కూతురు ఇంటికి ఎంతకీ రాక పోవడంతో గురువారం అంతా వెతికి నిరుత్సాహపడి పోయారు…
శుక్రవారం ఉదయం శ్రీవల్లి ఉపాధి హామీ గుంటలో కనిపించడంతో అందరూ వెళ్లి అమ్మాయిని బయటకు తీసి చూడగా మరణించినట్లు ధ్రువీకరణ కావడంతో గ్రామంలో విషాద ఛాయలు ఆలముకున్నాయి..
ఆ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామ ప్రజలు వేడుకొంటున్నారు…
మరణవార్త విన్న సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు వరదయ్య పాలెం మండలం టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఆకుటుంబాన్ని పరామర్శించి అనంతరం ఆకుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ మండల అధ్యక్షుడు నరసరాజు, NRI ఆణిముత్యం నంద కిషోర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దశరథన్, బండారి. జయశంకర్ రెడ్డి, బాబు రెడ్డి, సుధాకర్, నాగార్జున, పవన్ కళ్యాణ్, నిరంజన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, పుట్టయ్య, ఆదిశేసు, మురళి నాయుడు తది తరులు పాల్గొన్నారు..
