
*విద్యుదాఘాతంతో పాడి పశువులు మృతి
*
పిచ్చాటూరు మండలంలోని రెప్పాలపట్టు సమీపంలో అరణీయర్ ప్రాజెక్టు విద్యుత్ లైన్ తెగి కింద పడిపోయింది. నిత్యం మేతకు వెళ్లే పశువులు ఆ మార్గంలో వెళ్లడంతో తెగిన విద్యుత్ వైర్లు తగిలి సంఘటనా స్థలంలోనే మృతి చెందాయి. పాడి పశువులు మృతి చెందడంతో తమ జీవన భృతి కోల్పోయామని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పశువులను కోల్పోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
