
*ఈనెల 17 నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన*
▪️ *ఈనెల 20న 75వ పుట్టినరోజు సందర్భంగా విదేశీ యాత్ర*
ఈ నెల 17న సీఎం చంద్రబాబు ఐదురోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. ఈనెల 20న సీఎం చంద్రబాబు 75వ బర్త్డే వజ్రోత్సవ జన్మదినోత్సవం సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లనున్న చంద్రబాబు. బుధవారం రాత్రి చంద్రబాబు కుటుంబం డిల్లీకి చేరుకుని, గురువారం సాయంత్రం డిల్లీ నుంచి విదేశీ పర్యటనకు వెళ్తారు. ఇది వ్యక్తిగత పర్యటన కావున వివరాలు గోప్యంగా ఉంచారు.
