
*ఏపీలో ఇక ప్రభుత్వ కార్యాలయాలకు సౌర వెలుగులు!*
*అమరావతి…*
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ కార్యాలయాలపై(రూఫ్లైప్) 300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు NTPC విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్‌తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద వ్యవధిలో సుమారు రూ.2,957కోట్లు ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు సగటున రూ.6-8 వరకు చెల్లించాల్సి వస్తోంది. సౌర విద్యుత్ వాడితే ఈ మొత్తం సగానికి సగం తగ్గే
అవకాశముందని అంచనా….
