
మా ఎమ్మెల్యేను విమర్శిస్తే పుట్టగతులు ఉండవు*
*తండ్రిని అడ్డం పెట్టుకొని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంతులేని అవినీతికి పాల్పడ్డారు*
*ఓటమి ఖాయమని తెలియగానే పులివర్తి నాని గారి హత్యకు కుట్ర పన్నారు*
*గోవుల మృతిపై కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయడం హేయమైన చర్య*
*ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు గౌస్ బాషా*
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నీ సంస్కారం ఇక్కడే తెలుస్తుంది నీకన్నా వయసులో పెద్ద… చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారిని నాని అని సంబోధించినప్పుడే నువ్వు పెద్దలకు ఇచ్చే గౌరవం మర్యాద నీ సంస్కారం తెలుస్తుంది…. వయసుకు తగ్గ మాటలు…. స్థాయికి తగ్గ వారితో మాట్లాడితే బాగుంటుంది మోహిత్ రెడ్డి.
ఎలాంటి అవినీతి, ఆరోపణలు లేని వ్యక్తి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారు. విశ్రాంతి లేకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక సోషియల్ మీడియా వేదికగా దుష్ర్పచారం చేస్తున్నారు. ఆయనను విమర్శిస్తే పుట్టగతులు ఉండవు. సర్వనాశనం అవుతారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తండ్రిని అడ్డం పెట్టుకుని అంతులేని అవినీతి సంపదను పోగేసుకున్నావు. తుడా ఛైర్మన్ గా మోహిత్ రెడ్డి చేసిన అవినీతి బాగోతం త్వరలో ఆధారాలతో పాటు బట్టబయలవుతుంది. బినామీ పేర్లతో నడుస్తున్న కంపెనీలు, అక్రమాస్తులు, టీటీడీ (తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం) పేరుతో చేస్తున్న దోపిడీలు మొత్తం ఆధారాలతో బయటకు వస్తాయి. ఖచ్చితంగా జైలు జీవితం గడపాల్సి వస్తుంది.
*ఓటమి భయంతో పులివర్తి నాని గారి హత్యకు కుట్ర*
2024 ఎన్నికల్లో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని గారి గెలుపు ఖాయమని భావించి ఆయనను హత్య చేసేందుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కుట్ర పన్నారు. ఎన్నికల ముందు, పోలింగ్ రోజు.. ఫలితాల ముందు ఇలా ఎన్నిసార్లు దాడికి తెగబడ్డారో లెక్కే లేదు. ఆఖరికి తిరుపతి మహిళా యూనివర్శిటి వేదికగా నాని గారి కారుపై తన గ్యాంగ్‌తో మోహిత్ దాడి చేయించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో వైసీపీ శ్రేణులు, చెవిరెడ్డి అనుచరులు సుత్తి, రాడ్లు, బీరు సీసాలతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో పులివర్తి నాని గారి కారు ధ్వంసం కాగా.. గన్‌మెన్ ధరణికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. 150 మందికిపైగా రాడ్లు, కత్తులతో వచ్చి దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. దేవుని దయతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనతోనే మోహిత్ రెడ్డి పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గొడవ తర్వాత మోహిత్ రెడ్డి పరార్ అయ్యాడు. బెంగళూరులో ఉన్నారని పక్కా సమాచారం రావడంతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. 307 సెక్షన్ నమోదు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి బిక్షతో బయట తిరుగుతున్నావు. నువ్వు కూడా నాని గారిని విమర్శిస్తే ఎలా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి..!!
*కరుణాకర్ రెడ్డి దేవుళ్లుతో రాజకీయాలు ఏంటి?*
అనారోగ్యంతో, సహజంగా, వృద్దాప్యంతో గోవులు మృతి చెందడం సాధారణం. గోశాలలో మృతి చెందిన గోవులతో టీడీపీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయాలు చేయడం ఏమిటి ? ఎక్కడో చనిపోయిన గోవులను ఇక్కడివే అన్నట్లు చూపించడం దుర్మార్గం. ప్రత్యర్థులతో రాజకీయంగా పోరాటం చేయాలి కానీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టీటీడీపై ఆరోపణలు చేయడమేంటి? గోశాలలో గోవులు మరణించాయంటూ అందుకు సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియా సాక్షిగా పోస్ట్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే టీటీడీ బోర్డు స్పందించింది. ఇది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. స్వామి వారి భక్తుల మనోభావాలను దెబ్బ తీయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు…
అదంతా ఒక ఎత్తైతే జైలుకు వెళ్లి బెయిల్ పై బయట తిరుగుతున్న నువ్వు కూడా నీతులు వల్లిస్తున్నావంటే నిన్ను ఏమనాలి మోహిత్ రెడ్డి…. నీ స్థాయికి తగ్గ వారితో మాట్లాడుకో… నాని గారితో ఢీకొట్టే అంతస్థాయి… ఆయన గురించి మాట్లాడే స్థాయి నీది కాదు జాగ్రత్త* అసలు సిసలైన A1 @ చెవిరెడ్డి మోహిత్
