
*అవతార పురుషుడు బి.ఆర్ అంబేద్కర్*
✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*
✍️ *సత్యవేడు లో ఘనంగా భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి*
భారత రత్న, బాబా సాహెబ్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అవతార పురుషుడని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొనియాడారు.
సోమవారం ఉదయం 11 గంటలకు నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడు లో జరిగిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ వల్లే రాష్ట్రంలో 31 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి అడుగుపెట్టగలుగామన్నారు.
మాకందరికీ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా టికెట్టు కేటాయించడం, అతని తనయులు, యువనేత నారా లోకేష్ సంపూర్ణ సహకారం అందించడం, ప్రజల చల్లని దీవెనలు అందించి తమను ఎమ్మెల్యే స్థానంలో ఉంచారన్నారు.
తనకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి రుణపడి ఉంటానని, చంద్రన్న, లోకేష్ బాబు మాటకు కట్టుబడి ఉంటానని, తనను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన సత్యవేడు ప్రజలకు.. ఈ ప్రాంత అభివృద్ధికి నిత్యం శ్రమిస్తూనే ఉంటానని చెబుతూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భావోద్వేగానికి గురయ్యారు.
తాను సర్పంచ్ స్థాయి నుండి గత 45 ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నానని, తనపై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తగ్గేదే లేదని.. అలాంటి వారి సంగతి తెలుగుదేశం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని.. తాను మాత్రం నిత్యం ప్రజలతో మమేకమై నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్యే ఆదిమూలం స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి అభిమానులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
