
*ఘనంగా డాక్టర్ బి.ఆర్.అంబేత్కర్ 134 జయంతి వేడుకలు…*
నాగలాపురం: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేత్కర్ 134 జయంతి వేడుకలను నాగలాపురం మండలంలో ఘనంగా నిర్వహించారు.
ఈ మేరకు మేజర్ పంచాయతి సర్పంచ్ చిన్నదొరై సుధా ఆద్వర్యంలో ప్రజా ప్రతినుదులు, వైఎస్ఆర్శీపీ సీనియర్ నాయకులందరూ కలిసి, మొదట డాక్టర్ బీఆర్ అంబేత్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళుళర్పించారు.
ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ సమాజంలో అంటరానితనాన్ని నిర్మూలించేందుకు అంబేత్కర్ చేసిన కృషి మరవలేని దన్నారు. ఆయన రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారాని కొనియాడారు.
అనంతరం నాయకులందరు కలిసి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న అంబేత్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అపరంజిరాజు, వైస్ ఎంపీపీ కుమారి ఉదయ్ కుమార్ రెడ్డి, ఉప సర్పంచ్ సునీత హరిబాబు, నాయకులు ధనరాజ్, ఉదయ్ కుమార్ , సుకుమార్ , జేమ్స్, గజేంద్రన్, చిరంజీవి, గిరి, అలగేషన్, తదితరులు పాల్గొన్నారు
