
*దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్*
✍️ *నాగలాపురం అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే ఆదిమూలం*
✍️ *రక్తదాన శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే*
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి అని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొనియాడారు.
సోమవారం భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి ని పురస్కరించుకొని ఎమ్మెల్యే ఆదిమూలం నాగలాపురం లో అంబేద్కర్ విగ్రహానికి గజ మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఉచిత రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి, రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన వారికి పండ్లు, జ్యూస్ ప్యాకెట్ లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విభిన్న మతాలు, కులాలు, ప్రాంతాల ఉన్న మన దేశంలోని అందరికీ ఆమోదయోగ్యంగా రాజ్యాంగాన్ని రచించి జాతికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి అభిమానులు కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
