
బంగారుపాళ్యం మండల టిడిపి క్లస్టర్ ఇన్చార్జి ఎన్.పీ. ధరణి నాయుడు జన్మదిన వేడుకలు.
బంగారుపాళ్యం గరుడ ధాత్రి న్యూస్ ఏప్రిల్ 13.
బంగారుపాళ్యం మండలం, నలగాంపల్లి గ్రామానికి చెందిన ఎన్.పీ. ధరణి ప్రసాద్ నాయుడు జన్మదిన వేడుకల ను ఆయన అభిమానులు బంగారుపాళ్యం నందు కేక్ కట్ చేసి ఆదివారం ఘనంగా నిర్వహించారు. తదుపరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు,పండ్లు,రొట్టెలు వైద్యాధికారి డాక్టర్ విజయకుమారి చేతులమీదుగా పంపిణీ చేశారు. మండలంలో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు 7 ఫ్యాన్లను వితరణగా పాఠశాల వైస్ ప్రిన్సిపల్ కోకిల, పాఠశాల సిబ్బంది సుకన్య లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి జనార్దన్ గౌడ్, నాయకులు బీసీ రవీంద్ర నాయుడు, తగ్గువారిపల్లి వైస్ సర్పంచ్ లోకనాథ నాయుడు, టీ కే. హరిప్రసాద్, బెజవాడ చందు,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్నయ్య,మాజీ ఎంపీటీసీ గిరిబాబు,ఎంపీటీసీ విజయ్ కుమార్, నల్లగాంపల్లి యువ నాయకుడు శివ, కృష్ణమూర్తి, శివాజీ, రాజశేఖర్, రామయ్య, తదితరులు పాల్గొన్నారు
