
*రామగిరి అంకాలమ్మ ఆలయంలో వైభవంగా పౌర్ణమి పూజలు*
✍️ *భక్తి ప్రపత్తులతో అమ్మవారి ఊంజల్ సేవ*
పిచ్చాటూరు మండలం రామగిరి లో వెలసియున్న శ్రీ అంకాలపరమేశ్వరి ఆలయం లో శనివారం రాత్రి పౌర్ణమి పూజలు అత్యంత వైభవంగా జరిగింది.
సాయంత్రం 7 గంటలకు ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్ కు ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
అనంతరం ఊంజల్ మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఊంజల్ పై ఆధీష్టించి వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు.
అర్థరాత్రి 12 గంటల వరకు భక్తులు అమ్మవారి భజన పాటలతో నాట్యం చేస్తూ తన్మయత్వం చెందారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు ఆలయంలో విశేష పూజలు, ఊంజల్ సేవ జరుగుతుందని తెలిపారు.
