
పత్రికా ప్రకటన ఒంటిమిట్ట/ తిరుపతి 2025 ఏప్రిల్ 11
ఒంటిమిట్టలో శ్రీ సీతారామ లక్ష్మణులకు స్వర్ణ కిరీటాలు
ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయానికి సుమారు రూ.6.60 కోట్ల విలువైన మూడు వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలను, పెన్నా సిమెంట్స్ అధినేత శ్రీ ప్రతాప్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులతో కూడి శుక్రవారం నాడు విరాళంగా అందించారు.
దాదాపు 7 కేజీల బంగారంతో తయారు చేసిన ఈ స్వర్ణ కిరీటాలను ఆలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావులకు దాత అందించారు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈ కిరీటాలను శ్రీ సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు అలంకరించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.
