
*గుంతను పూడ్చే దిక్కెవరు..*
నాగలాపురం: స్థానిక బజారు వీధిలో తిరుమల మిల్క్ డైరీ ఎదురుగా రోడ్డుకు గుంత ఏర్పడింది.
ఈ గుంత వల్ల ద్విచక్రవాహన దారులు క్రింద పడి రోడ్డు ప్రమాదానికి గురవుతున్నారు. అంతే కాకుండా వర్షాకాలంలో గుంతలో నీరు నిలిచినప్పుడు బస్సులు, కార్లు వేగంగా గుంతల మీద వెళ్లినప్పుడు రోడ్డు ప్రక్కన నడిచి వెళ్తున్న వారి మీద బురదజల్లుతుంది. ఈ రోడ్డు మీదుగా అటు తహశీల్దారు కార్యాలయానికి ఇటు పంచాయతి కార్యాలయానికి మండల అధికారులు దాటి వెళ్తున్న చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైన సంబందిత ఉన్నత అధికారులు స్పందించి ఈ గుంతను పుడ్చి వేయవలసినదిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు.
