Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కియా పరిశ్రమలో భారీ చోరీ..ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం

కియా పరిశ్రమలో భారీ చోరీ..ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం

 

శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలో భారీ చోరీ జరిగింది. జిల్లాలోని యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా పరిశ్రమలో సుమారు 900 కార్ల ఇంజిన్లు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మార్చి 19న ఈ ఘటనపై కియా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కియా ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు.

విచారణ కోసం పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. కియా పరిశ్రమకు కంటైనర్ల ద్వారా కార్ల ఇంజిన్లు వస్తుంటాయి.

ఈ క్రమంలో చోరీ జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

అంబేడ్కర్ విగ్రహాన్ని కాల్చిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి

Garuda Telugu News

నాగలాపురం లైన్ మ్యాన్ శరవణ కు ప్రశంసా పత్రం

Garuda Telugu News

టిడిపి నేత వెంకట కృష్ణయ్య చిత్ర పటానికి ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి

Garuda Telugu News

Leave a Comment