
స్వపక్షంలోనే.. విపక్షం..!!.
సత్యవేడు తేదేపాలో ఆత్మ శోధన..
పరిశ్రమలు రావాలి.. పారిశ్రామిక ప్రగతి తోనే అభివృద్ధి సాధ్యం అనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారు అయితే ఆయన ఆశయాలకు కొందరు తెదేపా నాయకులు బహిరంగంగా తూట్లు పొడుస్తున్నారు ఈ అంశం సత్యవేడు తెదేపాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది సత్యవేడు శ్రీ సిటీ విస్తరణకు భూసేకరణ పనులు సరే వేగంగా సాగుతున్నాయి ఆ మేరకు నిరంతరం రాష్ట్రస్థాయి అధికారులు ఇక్కడ భూ సేకరణ పనులు పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే అయితే కొందరు తెదేపా నాయకులు భూసేకరణకు అడ్డు పెడుతూ వస్తున్నారు చిన్న, సన్నగా రైతులు, కొందరు మేటి రైతులు భూ సేకరణకు సై అంటున్నారు ఈ విషయాల్లో రైతుల్లో అనవసరమైన గందరగోళాన్ని సృష్టించడానికి అధికార టిడిపి నేతలు వైసీపీ శ్రేణులతో జత కట్టారు ఏపీఐఐసీకి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని వైసీపీ శ్రేణులు తమ రాజకీయ ఉనికి కోసం నినాదాన్ని తీసుకొస్తే.. వారి నినాదానికి ఇరుగుళం, రాళ్ల కుప్పం గ్రామాలకు చెందిన టిడిపి నాయకులు మద్దతు పలుకుతూ సమావేశంలో అన్ని తామై వ్యవహరించడం మండల టిడిపిలో తీవ్ర చర్చకు దారితీసింది సమస్య ఏదైనా ఉంటే… నేరుగా తనకు వినతిపత్రం ఇస్తే.. ఇబ్బందులు లేకుండా చూస్తానని భరోసా ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఆదేశాలకు పై నేతలు తూట్లు పొడవడం బాధించే అంశంగా ఉందని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో చిన్న, సన్న కారు రైతుల నుంచి శ్రీ సిటీకి భూములు తీసి ఇచ్చిన వారు నేడు తమ భూములను ఇవ్వడం కుదరదని చెప్పడం ఎంతవరకు సమంజసమో అన్న విషయం అందరూ అవగతం చేసుకోవాలని కొందరు సూచిస్తున్నారు
