
*చంద్రన్న హాయంలో గ్రామాల్లో అభివృద్ధి పరవళ్ళు..*
✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*
✍️ *కేవీబీ పురంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన*
గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు.
మంగళవారం కే వి బి పురం మండలంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, భూమి పూజలు, పలు సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఉదయం 10 గంటలకు కే వి బి పురం మండలంలోని కోటమంగాపురం గ్రామానికి చేరుకొని రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంటు రోడ్డు ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
అనంతరం ఇల్లు లేని పేద ప్రజలకు ఇంటి పట్టాలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతులు మీదుగా పంపిణీ చేశారు. అలాగే గ్రామంలోని భూ సమస్యలను రెవెన్యూ అధికారుల ద్వారా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అక్కడనుండి వగత్తూరు గ్రామానికి చేరుకొని రూ.14 లక్షలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న పేదలకు పొజిషన్ సర్టిఫికెట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
అనంతరం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు వ్యవసాయ పనిముట్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు.
చివరగా ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మిస్తున్న పశువుల తొట్ట కు ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది తిరగక ముందే గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమం విస్తృతంగా జరుగుతుందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తమ చంద్రన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
