
*డాక్టరేట్ గ్రహీత డాక్టర్ రాయల్ మల్లీశ్వరి కి ఎమ్మెల్యే ఆదిమూలం సత్కారం*
పిచ్చాటూరు జడ్పీ హైస్కూల్ హిందీ పండిట్, డాక్టరేట్ గ్రహీత డాక్టర్ రాయల్ మల్లీశ్వరిని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం ఘనంగా సత్కరించారు.
డాక్టర్ మల్లేశ్వరి ఆధ్యాత్మిక(ధ్యానం), సామాజిక సేవా కార్యక్రమాలలో విశిష్ట సేవలు అందించినందుకు గత నెల డాక్టరేట్ పట్టా, కలాం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకోవడంతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో తన నియోజకవర్గంలో ఇంతటి గొప్ప అవార్డులను అందుకున్న మల్లేశ్వరిని ఎమ్మెల్యే ఆదిమూలం గజమాల, శాలువా తో ఘనంగా సత్కరించారు.
ఆమె సేవా కార్యక్రమాల ద్వారా ఈ స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, దేవుని ఆశీస్సులు ఆమెకు తోడవ్వాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ డి.ఇలంగోవన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పద్దు రాజు, బంగాళ జయచంద్ర నాయుడు, రమేష్, డిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు.
