
పశువుల షెడ్డు పరిశీలించిన డ్వామ పిడి శ్రీనివాస ప్రసాద్
……………………………………………………………..
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం దాసుకుప్పం గ్రామంలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన గోకులం, సిమెంటు రోడ్లను జిల్లా డ్వామ పిడి శ్రీనివాస ప్రసాద్ పరిశీలించారు.మంగళవారం స్థానిక ఉపాధి హామీ ఏపీవో విజయ భాస్కర్,టిడిపి నాయకులు లోకయ్య రెడ్డి, జగన్నాథ్ రెడ్డి తదితరులతో కలిసి భజనగుడి వీధిలో రెండు లక్షల ముప్పై వేల రూపాయల ఉపాధి నిధులతో నిర్మించిన పశువుల షెడ్‌ను పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యాలయం సమీపంలో దాదాపు 5 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్ ను కూడా పరిశీలించడం జరిగింది.అయితే గోకులం,సిమెంటు రోడ్డు నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు మంజూరు కాలేదని ఈ సందర్భంగా గుత్తేదారు ప్రాజెక్టు డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్ బిల్లులు త్వరలోనే జమవుతాయని పిడి శ్రీనివాస ప్రసాద్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధి జేఈ హరి,టెక్నికల్ అసిస్టెంట్ మనోహర్ పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
