
పత్రికా ప్రకటన! ప్రచురణార్థం!!
పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించండి- సిపిఎం!
పేద ప్రజలపై భారాలు మోపుతున్న మోడీ ప్రభుత్వం అలవాటుగానే ధరలు పెంచుతున్నారని, నిత్యం పేద ప్రజలు ఉపయోగిస్తున్న వంట గ్యాస్ ధరలను పెంచిందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి జనార్ధన్ మండిపడ్డారు.
పేద మహిళలు నిత్యావసర సరుకుగా వాడే వంటగ్యాస్ పై 50 రూపాయలు పెంచడం దారుణం అన్నారు. కేంద్రం ధరలు పెంచుతుంటే రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం, జనసేన పార్టీలు ఖండించకపోవడం బాధాకరమన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్న తరుణంలో ప్రస్తుతం ఇస్తున్న గ్యాస్ పై ధరల పెంచి ఉచితంగా ఇస్తున్న సబ్సిడీని మరో చేత్తో లాక్కున్నట్టుగా ఉందని జనార్ధన్ విమర్శించారు.
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గినప్పటికీ మనదేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గకపోగా సుంకాల పేరుతో పెంచడం దారుణమన్నారు.
దేశంలో ప్రశ్నించే వారే లేకపోవడంతో ఎదురులేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు
ఇప్పటికైనా ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు లేకపోతే భవిష్యత్తులో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిం
