Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నాగార్జున యూనివర్సిటీ బీఎడ్ ప్రశ్నాపత్రం లీక్

*నాగార్జున యూనివర్సిటీ బీఎడ్ ప్రశ్నాపత్రం లీక్*

 

నాగార్జున వర్సిటీ పరిధిలో బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్ మెంట్ పరీక్ష. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పేపర్ లీక్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీఎడ్ పరీక్షల ప్రశ్నాపత్రం లీక్ అయింది. బీఎడ్ మొదటి సెమిస్టర్ కు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్ మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా… పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పేపర్ లీక్ అయింది. కాలేజీల యాజమాన్యాలే పేపర్ లీక్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

అయితే, దీనిపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ పరీక్షల కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సుబ్బారావును మీడియా వివరణ కోరగా… పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందు సీడీ ద్వారా పేపర్ రిలీజ్ చేశారని, అది బయటికి ఎలా లీకైందో తెలియదని బదులిచ్చారు. కాగా, నిన్న జరిగిన పరీక్షలోనూ క్వశ్చన్ పేపర్ అరగంట ముందే బయటికి వచ్చినట్టు తెలుస్తోంది.

 

Related posts

రాయపేడు గ్రామ పంచాయతీ లో ఉచిత పశు వైద్య శిబిరం

Garuda Telugu News

ట్రంప్ ప్రమాణ స్వీకారం వేళ దుండగుల కాల్పులు..! _ హైదరాబాద్ యువకుడు మృతి

Garuda Telugu News

అమెరికాలో అగ్ని ప్రమాదం.. తెలంగాణ విద్యార్థిని మృతి

Garuda Telugu News

Leave a Comment