
*జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ నాగబాబు గారు నామినేషన్ దాఖలు*
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకి కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా శ్రీ నాగబాబు గారు శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ నారా లోకేష్ గారు, బీజేపీ శాసనపక్ష నేత శ్రీ పి.విష్ణుకుమార్ రాజు గారు, ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ గార్లతో కలిసి రిటర్నింగ్ అధికారి శ్రీమతి వనితా రాణి గారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ దాఖలు సందర్భంగా కూటమి ఎమ్మెల్యేలు శ్రీ నాగబాబు గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

