
*సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించండి సార్*
✍️ *విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యే ఆదిమూలం విజ్ఞప్తి*
✍️ *ఎమ్మెల్యేను ఆప్యాయంగా పలకరించి వినతలను స్వీకరించిన మంత్రి లోకేష్*
సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేశారు.
గురువారం అసెంబ్లీ అనంతరం మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మర్యాదపూర్వకంగా కలిసి తన నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కారం కోరుతూ వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లు, స్మశానాలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆధునికీకరణ, పేదలకు ఇంటి పట్టాలు, తుఫానుకు కూలిన వంతెనలు మరమ్మత్తు పనుల పై ప్రధానంగా విన్నవించినట్లు వెల్లడించారు.
అందుకు సానుకూలంగా స్పందించిన గౌరవ మంత్రి నారా లోకేష్ గారు తప్పక అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
ఈకలయిక సందర్భంగా మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఎమ్మెల్యే నుండి వినతులను స్వీకరిస్తూ.. అన్నా ఆరోగ్యం జాగ్రత్త..’ అంటూ ఆప్యాయంగా పలకరించడం గమనార్హం.

