
*రామచంద్రాపురం మండలం పరిధిలోని సొరకాయపాళ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బెంచీలు వితరణ మరియు పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధా రెడ్డి గారు.*
*సొరకాయపాళ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధా రెడ్డికి ఘన స్వాగతం పలికిన పాఠశాల సిబ్బంది నాయకులు, కార్యకర్తలు.*
*సొరకాయపాళ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సరస్వతి పూజలో పాల్గొని…..విద్యార్థులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధా రెడ్డి గారు.*
*అనంతరం ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధా రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17 నుండి రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తుంది దానిలో భాగంగా సొరకాయపాళ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి 17 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారు . పరీక్ష రాస్తున్న విద్యార్థులు మంచిగా పరీక్షలు రాసి స్కూల్, సిబ్బంది, తల్లితండ్రులకు గొప్ప పేరు తెచ్చి ఉన్నత స్థాయికి వెళ్ళాలని విద్యార్థులకు పిలుపునిచ్చిన అనంతరం విద్యార్థులతో ముచ్చటించిన ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధా రెడ్డి గారు.*
*ఈ నెల17 తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థుల సౌకర్యార్థం సొరకాయపాల్యం జిల్లా ఉన్నత పాఠశాలకు బెంచీలు వితరణ చేయడం జరిగిందని తెలిపిన దాత ప్రొఫెషనల్ కొరియర్ అధినేత ఆర్. బాబు నాయుడు.*
*సొరకాయపాళ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సుమారు 6 లక్షల రూపాయలతో 62 బెంచీలు వితరణ చేసిన దాత ప్రొఫెషనల్ కొరియర్ అధినేత ఆర్. బాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధా రెడ్డి గారు.*
*62 బెంచీలను సొరకాయల పాలెం ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ కు అందజేసిన ఎమ్మెల్యే గారి సతీమణి పులివర్తి సుధా రెడ్డి గారు, దాత ప్రొఫెషనల్ కొరియర్ అధినేత ఆర్. బాబు నాయుడు గారు.*
*ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి,పాఠశాల సిబ్బంది, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

