
రేపటినుండిసామాజిక తనిఖీ ప్రారంభం
గరుడ ధాత్రి బ్యూరో మార్చి 3.
పీలేరు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2023-2024 సం నందు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ సిబ్బంది , సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం ఎంపీడీవో శివ శంకర్ నిర్వహించడమైనది.ఈ సమావేశంలో ఏపీఓ అశోక్ రెడ్డి, ఎస్ఆర్పి ముర్ షాద్, గతంలో పనిచేసిన ఏపీఓ మహేష్ పాల్గొన్నారు. మంగళవారం నుండి సామాజిక తనఖీ గ్రామ పంచాయతీల నందు సామాజిక తనిఖీ సిబ్బంది పనులు తనకి మరియు కూలీలతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని సామాజిక తనిఖీ సిబ్బందికి రైతులు కూలీలు, మెట్లు, ప్రజా ప్రతినిధులు& ఫీల్డ్ అసిస్టెంట్లు సహకరించవలెనని కోరడమైనది. ఈ కార్యక్రమంలో ఏఈ పీ ఆర్ రాజు నాయక్, గృహ నిర్మాణ శాఖ డివిజనల్ ఇంజనీర్ రమణయ్య ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఉపాధి సిబ్బంది ,సామాజిక తనికి సిబ్బంది పాల్గొన్నారు.

