
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
గరుడ దాత్రి బ్యూరో మార్చి 3:
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు.సోమవారం రాయచోటి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ శాఖ ఆధ్వర్యంలో… డిగ్రీ మరియు ఆపై తరగతులు చదువుతున్న ఆరు మంది విభిన్న ప్రతిభావంతులకు కలెక్టర్ చేతుల మీదుగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. అలాగే “జాతీయ దివ్యాంగుల ఆర్థిక అభివృద్ధి పథకం” (NHFDC) ద్వారా టెంట్ హౌస్ వ్యాపారంతో స్వయం ఉపాధి పొందుట కోసం షేక్ జిలానీ అను విభిన్న ప్రతిభావంతుడుకి మంజూరు చేసిన రూ.5 లక్షల రుణం చెక్కును కూడా అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ… విభిన్న ప్రతిభావంతుల విద్యాభివృద్ధి కోసం, స్వయం ఉపాధి కోసం మరియు వారి సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఆర్ వి క్రిష్ణ కిషోర్, వారి సిబ్బంది, లబ్దిదారుల తల్లిదండ్రులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

