
*”తోటపల్లి గూడూరు మండలంలో కాకాణి పర్యటన”*
*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:02-03-2025*
*సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, వరిగొండ గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*
*జ్వాలాముఖి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నూతనంగా ప్రతిష్టించిన నాగేంద్రుని దర్శించుకున్న కాకాణి.*
*కూటమిపాలన బాగాలేదంటూ కాకాణి ముందు పెదవి విరిచిన ప్రజలు.*
*విచారణ పేరిట, దివ్యాంగులకు మంజూరైన పెన్షన్లు అన్యాయంగా ఎత్తివేస్తున్నారంటూ మండిపడ్డ లబ్ధిదారులు.*
*గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు చంద్రబాబును నమ్మి మోసపోయామని గగ్గోలు పెట్టిన గ్రామస్తులు.*
*మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ..*
👉 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజలకు మేలు చేస్తే, కూటమిపాలనలో పచ్చ తమ్ముళ్లు తమ మేలు చేసుకోవడం తప్ప, ప్రజలను పట్టించుకోవడం లేదు.
👉 ఆడబిడ్డ నిధి, నెలకు రూ.1500/-లు ఇస్తానని ఇంతవరకు ఇవ్వకపోగా రెండవ వార్షిక బడ్జెట్లో కూడా నిధులు కేటాయించకపోవడం దుర్మార్గం.
👉 కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగ భృతి నెలకు రూ.3000/-లు చెల్లిస్తామని హామీ ఇచ్చి, బడ్జెట్ లో నిరుద్యోగ భృతి ఊసే లేకుండా చేయడం, నిరుద్యోగులను దారుణంగా మోసం చేయడమే.
👉 మహిళలు ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ఎప్పటికీ వస్తుందో తెలియక, అగమ్యగోచరంగా మారిన పరిస్థితి.
👉 తల్లికి వందనం అన్నదాత సుఖీభవకు అర – కొరగా నిధులు కేటాయించడం చూస్తే, అర్హత కలిగిన లబ్ధిదారులను పక్కన పెట్టనున్నట్లు స్పష్టమైంది.
👉 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పేరిట చంద్రబాబు మహిళలను మోసగిస్తున్నాడు.
👉 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇచ్చిన హామీలు అధికభాగం దాదాపుగా అన్ని అమలు చేశారు.
👉 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సానుభూతిపరులకు ఏ పని చేయరాదంటూ మాట్లాడిన చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాడు.
👉 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాజకీయాలకతీతంగా, పార్టీల ప్రమేయమే లేకుండా, అన్ని వర్గాల ప్రజలకు పారదర్శకంగా పథకాలు అందించిన విధానాన్ని ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.
👉 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, ఎవ్వరికీ అన్యాయం జరిగినా, పోరాడుతాం తప్ప, విడిచిపెట్టం.
👉ఈగ కార్తీక్ మరియు పొట్లూరి సింధూజల వివాహ జంటను ఆశీర్వదించిన మాజీ మంత్రి కాకాణి.

