
*సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శనివారం ఘన స్వాగతం పలికారు.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పర్యటన నిమిత్తం శనివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు చేరుకున్నారు.
అప్పటికే విమానాశ్రయంలో వేచిఉన్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి ఘన స్వాగతం పలికారు.

