
*గూడూరులో “గోవులు” మాయం*
………………………………………….
*🐄సూడి అవుల పై కసాయిల కన్ను*
………………………………………….
*లబో దిబోమంటున్న పాడి రైతులు*
………………………………………….
*గూడూరులో గత కొద్ది రోజులుగా గోవులు మాయం అవుతున్నాయి.గ్రామాల్లో పశు సంతతి తగ్గిపోవడం, గోమాసం కోసం ఎద్దులను,గోవులను వధించడం,నగరాలకు అక్రమ రవాణా చేస్తుండటంతో గోవులు నానాటికీ అంతరించి పోతూవస్తున్నాయి.పట్టణ శివార్లలో ఉన్న గోవులపై కసాయి గాళ్ళ కన్ను పడటంతో రాత్రులు వాటిని మాయం చేస్తున్నారు.గత శనివారం ఫిబ్రవరి 22వ తేది నుంచి గూడూరు గాంధీనగర్,తిలక్ నగర్, ఇందిరానగర్ ప్రాంతాల్లో పాడి రైతులకు సంబధించిన 10 గోవులు అదృశ్యం అయ్యాయి.వీటిలో సూడి అవులు అధికంగా ఉండటంతో రైతుల ఆవేదన చెందుతున్నారు.జనవరి నెలలో కూడా గూడూరు పట్టణంలో పలు ప్రాంతాల్లో గోవులు మాయం అయ్యాయి.గోవుల అదృశ్యం వెనుక కసాయి గాళ్ల హస్తం ఉందా..మరేదైనా కారణాలు ఉన్నాయా..అనే అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు.మాయం అయిన గోవుల కోసం గూడూరు పరిసర గ్రామాల్లో గాలించినా ఫలితం కానరావడం లేదని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఉన్న సిసీ కెమెరాలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని గోవుల యజమానులు వేడుకుంటున్నారు.

