
*తారు రోడ్లు మట్టి రోడ్లు గా మారిన వైనం*
*మాఫియా ఆగడాలకు సజీవ సాక్ష్యం…*
ప్రజల ప్రయాణం దినదిన గండం..
*గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు స్తంభించే స్థాయికి ప్రమాదం ఏర్పడింది…*
*గత ప్రభుత్వ హయాంలో గ్రావెల్, ఎర్ర మట్టి విచ్చలవిడి అనుమతులతో నియోజకవర్గంలోని ప్రధాన రహదారులు ముఖ్యంగా సత్యవేడు మండలంలో వరదయ్యపాలెం మండలంలో కోతకు గురైన రోడ్లు …*
సహజంగా తుఫానుల వలన వరద ప్రభావంతో రోడ్లు కోతకు గురైతే….
సత్యవేడు నియోజకవర్గంలో మాత్రం ఎర్ర మట్టి గ్రావెల్ తరలించే భారీ టిప్పర్లు, వాహనాల వలన కోతకు గురవడం కోసం మేరుపు….
*గ్రామీణ ప్రాంత ప్రజల పాలిట శాపం గా మారిన వైనం…*
గాలి కాలుష్యానికి, దుమ్ము ధూళి కాలుష్యానికి, శబ్ద కాలుష్యానికి దూరంగా ఉండే పచ్చటి పొలాల మధ్య ప్రశాంతంగా నుండే గ్రామాల లో విలువైన ఎర్ర బంగారం ఉండడం వారి పాలిట శాపం గా మారింది….
*దానిపై మాఫియా డేగ కన్ను పడి గత ఐదు సంవత్సరాల్లోనే గ్రామీణ ప్రాంతాలు శబ్ద కాలుష్యానికి, గాలి కాలుష్యానికి, దుమ్ము దులి కాలుష్యానికి గురై ఉక్కిరిబిక్కిరి అయిన వైనం…..*
నూతన రహదారులు ఏర్పాటు చేయాలన్న కనీసం మరమ్మత్తులు చేయాలన్న కోట్లలోనే ఖర్చవుతుంది…
*స్వలాభాల కోసం ఆర్థిక లాభాల కోసం గత పాలకులు అధికారులు ఇచ్చిన అనుమతులతో ఈ దుస్థితి ఏర్పడడం గమనార్హం….*
ఏది ఏమైనా
కూటమి ప్రభుత్వం రావడంతో వీరి ఆగడాలకు కళ్లెం పడింది … గతంలో సక్రమమైన పద్ధతిలో అనుమతులు పొంది అక్రమ రవాణా చేస్తున్న వీరి ఆగడాలకు బ్రేక్ పడడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్న గ్రామీణ ప్రాంత ప్రజలు….
*తిరిగి అనుమతులు పొంది రవాణా ప్రారంభమైతే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒకే ఒక మార్గం ….వలసలు వెళ్ళక తప్పదు…..*
సత్యవేడు నియోజకవవర్గం అభివృద్ధి చెందాలన్న, నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభా ప్రకారం వారి భవిష్యత్తులో ప్రభుత్వం భూ పంపిణీ చేయాలన్న, విలువైన భూములు ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవాలన్న, ప్రభుత్వం ఉన్నతాధికారులు పాలకులు కచ్చితంగా సహజ వనరుల దోపిడీని నియోజకవర్గంలో అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది…
తిరిగి అనుమతులు పొందటానికి చాప కింద నీరుల ప్రయత్నాలు ముమ్మరం చేసిన మాఫియా.. ఆయా మండలాల్లో స్థానిక నాయకును ప్రసంగం చేసుకుంటూ డబ్బు ఆశ చూపుతూ సక్రమమైన పద్ధతిలో అనుమతులు పొంది అక్రమ రవాణా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం…
చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో…

