
*రోడ్డు ప్రమాద మృతుడు ఏసు కుటుంబాన్ని ఆదుకుంటాం*
✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*
✍️ *మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే తక్షణంగా ఆర్థిక సాయం*
నారాయణవనం మండలం కశింమిట్ట గ్రామానికి చెందిన యువకుడు ఏసు రోడ్డు ప్రమాదంలో మరణించారు.
సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే గురువారం వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని అంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి త్వరగా పోస్టుమార్టం నిర్వహించేలా వైద్యుల ద్వారా చర్యలు చేపట్టారు.
అనంతరం మట్టి ఖర్చులకు గాను యేసు కుటుంబానికి తక్షణసాయంగా ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకుడైన యేసు మరణం ఆ కుటుంబానికి తీరని లోటు అని, యేసు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటామాని భరోసా కల్పించారు.
*సత్యవేడులో అడ్వికెట్ రాజా కుటుంబ శుభకార్యంలో ఎమ్మెల్యే*
సాయంత్రం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడు చేరుకొని అడ్వకేట్ రాజా కుటుంబంలో జరిగిన శుభకార్యం లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అడ్వకేట్ రాజా అక్క కుమార్తె చల్లగా నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

