
*టిడిపి నేత వెంకట కృష్ణయ్య చిత్ర పటానికి ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి*
బుచ్చినాయుడు కండ్రిగ మండలం కుక్కం బాక్కం తెలుగుదేశం పార్టీ నేత మూడు రోజుల క్రితం మరణించారు.
ఆ సమయంలో ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉన్న కారణంగా శుక్రవారం మృతుని స్వగ్రామమైన కుక్కం బాక్కం చేరుకొని వెంకట కృష్ణయ్య చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.
అనంతరం కుటుంబ సభ్యులలో పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. వెంకట కృష్ణయ్య కుటుంబానికి పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో బుచ్చినాయుడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

