Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

వేస్టేజ్ ట్రాన్స్పోర్ట్ కంటైనర్ ని పట్టుకున్న అటవీశాఖ అధికారులు

*వేస్టేజ్ ట్రాన్స్పోర్ట్ కంటైనర్ ని పట్టుకున్న అటవీశాఖ అధికారులు*

 

వరదయ్యపాలెం మండలంలోని కడూరు రిజర్ ఫారెస్ట్ ఏరియాలో వేస్టేజ్ డంపింగ్ యార్డ్ నుండి పరిశ్రమకు ఉపయోగం లేని వేస్టేజ్ ను అన్లోడ్ చేస్తుండగా పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు…

వివిధ పరిశ్రమల వద్ద సేకరించిన వేస్టేజ్ ను తరలించడానికి కాంట్రాక్ట్ తీసుకున్న ఓ కాంట్రాక్ట్ కు చెందిన వేస్టేజ్ గోడౌన్ లో నుంచి పర్యావరణానికి హాని కలగకుండా వేస్టేజ్ బర్నింగ్ సెంటర్లకు తరలించాల్సింది పోయి….

డబ్బు ఆదా చేసే దురాలోచనతో ప్రక్కనే ఉన్న అటవీ ప్రాంతం పై డేగ కన్ను వేసిన ఇలాంటి కాంట్రాక్టర్లను ప్రోత్సహించడం ఆయా పరిశ్రమలు బాధ్యతతో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది…..

గతంలో కూడా ఈ అటవీ ప్రాంతంలో ఇదేవిధంగా చెత్తను తీసుకుని వచ్చి వేస్తుంటే అప్పటి అటవీశాఖ అధికారి కఠిన చర్యలు తీసుకోవడంతో దాని తరువాత రావడానికి కూడా భయపడ్డారు…..

ఏది ఏమైనా

కాలుష్యం కొరల నుండి అటవీ ప్రాంతాన్ని కాపాడాలంటే అటవీశాఖ సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…

సమయానికి బీట్ ఆఫీసర్ గమనించి వారిని అదుపులో తీసుకున్నాడు కాబట్టి ఈ బాగోతం బయటపడింది…

లేకుంటే అన్లోడ్ చేసిన తర్వాత అలాగే వదిలేసేవారా..? లేకుంటే నిప్పు పెట్టి వెళ్లేవారా….?

ఆయా పరిశ్రమల వద్ద అనధికారిక వేస్టేజ్ గోడౌన్లపై అధికారులు దాడులు నిర్వహించి కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్న స్థానికులు…

 

Related posts

టీటీడీకి మినీ ట్రక్కు విరాళం

Garuda Telugu News

మళ్లీ మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే…

Garuda Telugu News

రక్తదానం చేసిన కానిస్టేబుల్ సాయి

Garuda Telugu News

Leave a Comment